జాతీయ జెండాను ఆవిష్కరించిన MLA

PLD: మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.