జగ్గంపేటలో ఘనంగా సహస్ర కుంకుమ పూజలు
కాకినాడ: జగ్గంపేటలోని టీచర్స్ కాలనీ రామాలయం వద్ద కరుటూరి వెంకటలక్ష్మి, గుర్రం వేణు, అడపా లక్ష్మీ ఆధ్వర్యంలో ఇవాళ సహస్ర కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించి, అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు. కరుటూరి వీర్రాజు వెంకటలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు.