పలు శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

పలు శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

E.G: ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోందని, శాఖల వారీగా గ్రేడింగ్‌లో ర్యాంకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. గురువారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యాల సాధన వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత ఉండాలని అధికారులకు సూచించారు.