జిల్లా జైలులో తనిఖీలు చేయనున్న జైళ్ల శాఖ డీజీ
KMM: ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలోని జిల్లా జైలును జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా ఇవాళ సందర్శించనున్నట్లు జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులో తేనెటీగల పెంపకం యూనిట్‌ను డీజీ ప్రారంభించనున్నారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి ఖైదీలకు ఇస్తున్న ఆహారం, అందుతున్న వైద్యం, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.