VIDEO: రాజమండ్రిలో జనసైనికుల భారీ ర్యాలీ

E.G: ఉమా రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా దాసరి గురునాథం శ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం రాజమండ్రిలో జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి జాంపేట వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం దేవస్థానం పాలకమండలి డైరెక్టర్లతో కలిసి ఆయన ఆలయానికి చేరుకున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.