బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన హమాలి శివ(25) అనే యువకుడు సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. శివ కూలిపని చేసుకుంటూ, ఇటీవల మద్యానికి భానిసయ్యాడు. తల్లి మందలించడంతో రామన్నపల్లి పరిధిలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.