లింగారంతండా గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ
KMM: కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ మహిళా చీరల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు రామూర్తి, నాగేశ్వరావు, కిషన్, లక్ష్మ, శ్రీను, హుసేన్, యల్లయ్య, డ్వాక్రా సంఘం మహిళలు, తదితరులు పాల్గొన్నారు.