ఎరువుల బస్తా పైన పడి రైతు మృతి

NZB: ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన పల్లికొండ రమేష్(32) వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం ఎరువులు చల్లేందుకు పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్ వచ్చింది. రమేష్ తాను మోసుకెళ్తున్న ఎరువుల బస్తాతో ఒడ్డుపైనుంచి జారి మీద పడడంతో మృతి చెందాడు.