'విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి'

ELR: నూజివీడు మండలం అన్నవరం జడ్పీ హైస్కూల్లో మండల విద్యాశాఖ అధికారి జమలయ్య గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులందరూ హాజరయ్యేలా చూడాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు.