ప్రమాదకరంగా మారిన గుంత

ప్రమాదకరంగా మారిన గుంత

W.G: ఆచంట మండలం జక్కంశెట్టివారిపాలెం నుంచి కోడేరు వెళ్లే ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ వద్ద భారీ గుంత ఏర్పడింది. దీంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.