కామారెడ్డి పోలీస్ 'ఆపరేషన్ కవచ్' సక్సెస్!

కామారెడ్డి పోలీస్ 'ఆపరేషన్ కవచ్' సక్సెస్!

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న 'ఆపరేషన్ కవచ్' అద్భుత ఫలితాలను ఇస్తోంది. పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో వరుస దొంగతనాలకు చెక్ పడటమే కాకుండా, అంతర్రాష్ట్ర ముఠాలు సైతం పట్టుబడుతున్నాయి. ఇటీవల రామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు దొంగతనాల కేసులను పకడ్భందీగా ఛేదించారు.