ఉమ్మడి నార్నూరులో నేడు కరెంట్ కట్
ADB: నార్నూర్, గాదిగూడ మండలాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 33/11 కేవి విద్యుత్తు లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ నిలిపివేయనున్నామని పేర్కొన్నారు. కాగా విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.