ఆస్తి కోసం బంధువుపై కత్తితో దాడి
W.G: ఆస్తి తగాదాలతో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు ఫణీంద్ర కత్తితో దాడి చేశాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.