జనగణనపై కీలక అప్‌డేట్

జనగణనపై కీలక అప్‌డేట్

దేశంలో జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2026 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణనను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో వెల్లడించారు. జనగణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్, సెన్సెస్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందన్నారు. జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని చెప్పారు.