ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో వాహనాలు తీసుకెళ్లండి..!
MDCL: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన కేసుల్లో వాహనాలను ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచామని సీఐ జి.నాగరాజు తెలిపారు. వాహన యజమానులు వెంటనే చలానాలు చెల్లించి వాహనాలను తీసుకెళ్లాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఇది చివరి అవకాశం అని హెచ్చరించారు.