దీక్షల విరమణల ఏర్పట్లపై మంత్రి సమీక్ష
NTR: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి భవానీ దీక్షల విరమణల జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి అనిత ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 6 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్న అంచనాలతో భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై ఆలయ అధికారులు, పోలీస్ అధికారులతో చర్చించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.