పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలి: ఆర్.కృష్ణయ్య

పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలి: ఆర్.కృష్ణయ్య

HYD: పెండింగ్లో ఉన్న రూ.6 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాసబ్ ట్యాంకులో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు గేటు బయటే రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య అక్కడికి చేరుకుని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.