VIDEO: కన్నులపండుగగా కోలాట ప్రదర్శన
JN: బచ్చన్నపేట మండల పరిధిలోని కట్కూర్ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక నృత్యం - భక్తుల పరవశం సాంప్రదాయ దుస్తులు ధరించి, లయబద్ధంగా కోలాటం ఆడారు.