VIDEO: యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

VIDEO: యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో శుక్రవారం ఉదయం యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా అందుబాటులో లేకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల లభ్యత లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.