కొండకరకాంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

కొండకరకాంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి కొండకరకాం గ్రామంలో నాటు తుపాకీలు ఏరివేత లక్ష్యంగా సీఐ లక్ష్మణరావు, సిబ్బందితో ఆదివారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామాల్లో నాటు తుపాకీలు ఉంటే స్వచ్చందంగా అప్పగించాలని గ్రామస్తులను కోరారు. సోదాల్లో పట్టుబడితే ఆయుధ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.