VIDEO: మల్లన్న జాతరలో గంగా బోనం మహోత్సవం
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గంగా బోనం మహోత్సవాన్ని యాదవులు నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని యాదవ మహిళలు బోనమెత్తి ఆలయం వరకు ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ ఊరేగింపులో యాదవులు సంప్రదాయ డోలు వాయించగా బీర్ల కళాకారులు పోతరాజు వేషాధారణలో నృత్యాలు చేశారు. అనంతరం మల్లన్న స్వామికి గంగా బోనం సమర్పించారు.