ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
W.G: ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఇక్కడి కూరగాయల మార్కెట్, ఎస్ టర్నింగ్, సంత మార్కెట్ రామాలయాల్లో వందేళ్ల నాటి కొయ్య విగ్రహాలకు కళ్యాణం నిర్వహించడం విశేషం. సాధారణంగా పంచలోహ విగ్రహాలకు వేడుకలు నిర్వహిస్తారు, కానీ ఇక్కడ శతాబ్ద కాలంగా కొయ్య విగ్రహాలనే వాడుతున్నారు. నేటికీ ఈ విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.