ఘనంగా ప్రేరణ–2026 జిల్లా స్థాయి పోటీలు
BHNG: భారత ప్రభుత్వ విద్యాశాఖ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ–2026 జిల్లా స్థాయి పోటీలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో సోమవారం నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సీబీఎస్సీ, అనుబంధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కలిపి సుమారు 50 మంది వరకు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.