ఇంటర్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
EG: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం అభినందించారు. ఎమ్మెల్యే అనపర్తి మండలం రామవరంలో మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.