ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
VZM: గజపతినగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దివంగత మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పండగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.