రైతులకు సీఎం చంద్రబాబు అండ: ముక్కా రూపానంద రెడ్డి

రైతులకు సీఎం చంద్రబాబు అండ: ముక్కా రూపానంద రెడ్డి

అన్నమయ్య: కోడూరు మండలం, రాఘవరాజు పురం గ్రామంలో శుక్రవారం 'రైతన్నా మీకోసం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.20 వేలు మంజూరు చేస్తున్నారన్నారు.