'హరిహర వీరమల్లు' సూపర్, డూపర్ హిట్ అవ్వాలి: అంబటి

పల్నాడు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరంగా స్పందించారు. పవన్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం సూపర్, డూపర్ హిట్ కావాలని, కనకవర్షం కురవాలని బుధవారం Xలో పేర్కొన్నారు. దీనికి పవన్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.