మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే
BDK: పినపాక నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కీలక ముందడుగు వేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, గుండాల, అల్లపల్లి, బూర్గంపాడు మండలాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.