సహకార సంఘాల ఉద్యోగులు నిరసన
కోనసీమ: అమలాపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం వద్ద సహకార సంఘాల ఉద్యోగులు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచాలని, వేతన సవరణ అమలు చేయాలని, డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు చట్టప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.