24 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించాలి: హైకోర్టు

24 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించాలి: హైకోర్టు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కుమార్తె హిమయాని పురీపై SMలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఎప్‌స్టీన్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. ఈ విషయాలను ఏ విధంగానూ యూజర్లు ప్రచారం, వ్యాప్తి చేయకూడదని తెలిపింది. సంబంధిత SM వేదికలు ఆ కంటెంట్‌ను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.