గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని తాళ్లపాడు వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఎండి పర్వేజ్ ఖాన్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా అతని వద్ద 2 కిలోల 166 గ్రాముల గంజాయి లభించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.