'ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి'

'ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి'

MHBD: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని తొర్రూరు ఎస్సై అంజమ్మ తెలిపారు. తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామంలో సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.