24, 25న వ్యవసాయ భూములకు కౌలు హక్కు వేలం

VKB: ఈ నెల 24, 25వ తేదీన అనంతగిరి దేవాలయంలో 6 వ్యవసాయ భూములకు కౌలు హక్కు వేలం పాట నిర్వహించనున్నారు. 24న ఉదయం 11 గంటలకు వికారాబాద్, పూడూరు, ధారూర్, నవాబుపేట మండలాల్లో 25న ఉ.11 గంటలకు పరిగి, దోమ మండలాల్లో ఉన్న భూములకు కౌలు హక్కు వేలం పాట అనంతగిరి దేవాలయం ప్రాంగణంలో జరగనుంది. ఆసక్తి గల రైతులు రూ. 2000 డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్త N.పద్మనాభం తెలిపారు.