పాముకాటుతో బాలిక మృతి
MDK: పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (12) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటుకు గురైంది.