విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే మురళి నాయక్ సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలవడంతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా 100% ఉత్తీర్ణలతో ఫలితాలు వెలువడే విధంగా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు.