'భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

NLG: చింతపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రెవెన్యూ అధికారును కోరారు.