నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
VSP: వేపగుంట మండలం అప్పన్నపాలెం 11కేవీ విద్యుత్తు ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ బి. సింహాచలం నాయుడు తెలిపారు. శ్రీనివాసనగర్, గొల్లనారాయణపురం, అప్పన్నపాలెం, సింహపురి, గాయిత్రి లేఅవుట్లు, సమతా కాలనీ, బాలాజీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ కోత ఉంటుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.