గవర్నర్‌కు జిల్లా అధికారుల ఘన స్వాగతం
విశాఖ నగర పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి 9.15 గంటలకు విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డీసీపీ మేరీ ప్రశాంతి, తదితరులు స్వాగతం పలికారు.