'వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

'వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

VZM: తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వేపాడ ఎంఈవో పి బాల భాస్కరరావు కోరారు. సోమవారం ఆయన సింగరాయి ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.