పొన్నూరులో ఎరువుల దుకాణం ప్రారంభం

GNTR: పొన్నూరు మండల పరిధిలోని మామిళ్లపల్లిలో మన గ్రోమోర్ నూతన ఎరువుల దుకాణాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన ఎరువులు, పురుగుమందులను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు.