ఉపాధి హామీ పనులు పరిశీలన

ఉపాధి హామీ పనులు పరిశీలన

కడప: సింహాద్రిపురం మండలం లోమడ పంచాయతీ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీఓ క్రిష్ణమూర్తి పరిశీలించారు. మస్టర్లను తనిఖీ చేశారు. రూ.307 కనీస వేతనం తక్కువ కాకుండా కొలతల మేర పనులు చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామంలో అందరికీ పని చూపించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జయభారతి పాల్గొన్నారు.