అయినవిల్లి వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

కోనసీమ: అయినవిల్లి వినాయక చవితి మహోత్సవాలు-2025 ఉత్సవ ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొత్తపేట RDO శ్రీకర్, DSP మురళీ మోహన్ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా చూడాలని ఈవోకి సూచించారు. ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్స్, అన్న ప్రసాదం క్యూలైన్లను పరిశీలించారు.