ఎస్టియు అదనపు ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

ఎస్టియు అదనపు ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

MDK: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా తూప్రాన్ పరిధి బ్రాహ్మణపల్లి హైస్కూల్ ఉపాధ్యాయులు పి. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. STU 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎన్నికలు జరిగాయి. ఆయన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచినందుకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులందరికీ, జిల్లా ప్రతినిధులకు, STU సీనియర్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.