నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

SDPT: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోహెడలోని నారాయణపూర్, కాచాపూర్ గ్రామాల్లో వంతెనల నిర్మాణం, అలాగే పరివేద నుంచి హుస్నాబాద్లోని బంజెరుపల్లె, పొట్లపల్లి వరకు పీఆర్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు మంద ధర్మయ్య, బంక చందు తెలిపారు.