నంద్యాలలో కారంపొడి బ్యాచ్ హల్‌చల్
నంద్యాలలోని బస్టాండ్ సమీపాన గల నవీన్ ఫొటో స్టూడియో వీధిలో కారంపొడి బ్యాచ్ హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి సమయంలో ప్రతి ఇంటి దగ్గర కారంపొడి చల్లి ఉండటాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కారంపొడి చల్లడం దేనికి సంకేతం అని నంద్యాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఘటనపై స్థానికుడు రఫీ, కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.