టికెట్ రాకపోవడంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
WGL: నర్సంపేట మున్సిపల్ 16వ వార్డు పరిధిలోని పరశునాయక్ తండాకు చెందిన శోభన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన సోదరుడు కోర్ర క్రాంతికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు.