'గ్రామ స్థాయిలోనే రైతుల సమస్యలు పరిష్కారం'
VZM: 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధరాయవలస గ్రామంలో బుధవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రైతు సర్వే పురోగతి, పంటల స్థితి, పంట నష్టాల అంచనా, రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ఆయన పరిశీలించారు. గ్రామ స్థాయిలోనే రైతుల సమస్యలు, సూచనలు తెలుసుకొని సంబంధిత శాఖల ద్వారా వెంటనే పరిష్కరిస్తామన్నారు.