వీధి కుక్కల దాడిలో మేకల మృత్యువాత

ADB: ఆదిలాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడులు ప్రజలను, మూగజీవాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది గాయపడగా, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు రైతు ఎల్టి ప్రవీణ్ రెడ్డికి చెందిన మూడు మేకలను కరిచి చంపేశాయి. దీంతో బాధితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.