పోలీస్ ఔట్ పోస్ట్ తనిఖీ చేసిన సీఐ

పోలీస్ ఔట్ పోస్ట్ తనిఖీ చేసిన సీఐ

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని పోలీస్ ఔట్ పోస్ట్‌ను 2టౌన్ సీఐ సదాశివయ్య గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ప్రమాద బాధితులు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు వారి వివరాలను పక్కాగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల మరణాలు, మృతదేహాలను ఫోటోలు తీసి నమోదు చేయాలని వెల్లడించారు.