నాలుగు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు
KMR: మద్నూర్ మండల కేంద్రంలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. మద్నూర్‌లో మొత్తం ఏడు జిన్నింగ్ మిల్లులు ఉండగా గత శుక్రవారం వరకు నాలుగు జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నేటి నుంచి మరో జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేయనున్నట్లు సీసీఐ అధికారులు సోమవారం ప్రకటన లో తెలిపారు.